మహాలక్ష్మి పథకం కింద రూ.500 గ్యాస్ సిలిండర్ పథకం చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం…ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ వస్తోంది. చివరకు ఈ పథకం మహిళ పేరు మీద గ్యాస్ సిలిండర్ ఉన్న వాళ్లకేనని స్పష్టం చేసింది. దీంతో వైట్ రేషన్ కార్డులుంటే చాలు అనుకున్న వాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మహాలక్ష్మి పథకం కింద రూ.500 గ్యాస్ సిలిండర్ పథకానికి తెల్ల రేషన్ కార్డు ఉండాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలకే గ్యాస్ సబ్సిడీ వర్తించనుంది. ప్రజా పాలనలో గ్యాస్ సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలకు రూ.500లకే సిలిండర్ అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీనికి సంబందించి ఇవాళ(మంగళవారం) కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
రాష్ట్రంలోని మొత్తం 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లలో రేషన్ కార్డు ఉన్న కుటుంబాల సంఖ్య 89.99 లక్షలని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గ్యాస్ సిలిండర్ పై సబ్సిడీ మొత్తాన్ని నెలనెలా ప్రభుత్వం ఆయా కంపెనీలకు చెల్లించనుంది. గ్యాస్ కంపెనీలు లబ్దిదారుల ఖాతాలకు ఆ మొత్తాన్ని బదిలీ చేయనున్నాయి.
జీవో ప్రకారం…గ్యాస్ సబ్సిడీ పొందేందుకు తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి. మహిళల పేరుతో ఉన్న గ్యాస్ కనెక్షన్లకే వర్తింపు.మూడేళ్ల సగటు వినియోగం ఆధారంగా ఏటా ఇచ్చే సబ్సిడీ సిలిండర్లపై నిర్ణయం. ముందుగా మొత్తం ధరను చెల్లించి తీసుకోవాలి. 48 గంటల్లో సబ్సిడీ మొత్తం బ్యాంకులో జమఅవుతుంది.
ఇది కూడా చదవండి: రాడిసన్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్
