వైద్యం కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటన రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాలో జరిగింది. ఐసీయూలో చికిత్స పొందుతున్న మహిళపై నర్సింగ్ అసిస్టెంట్ అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…ఓ మహిళ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో ఆసుపత్రి చేరి ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఆసుపత్రి నర్సింగ్ అసిస్టెంట్ గా విధులు నిర్వహించే చిరాగ్ యాదవ్ మంగళవారం తెల్లవారుజామున ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మహిళ ప్రతిఘటించడంతో నిందితుడు మత్తు ఇంజెక్షన్ చేశాడు. దీంతో ఆ మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అనంతరం తన భర్త ఫోన్ చేయగా స్ప్రుహలోకి వచ్చిన బాధితురాలు కుటుంబ సభ్యులకు జరిగిన విషయం గురించి చెప్పింది. సీసీటీవీలో రికార్డు అయిన ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, ఎఫ్ఐఆర్ నమోదు చేశామని అధికారి తెలిపారు.
ఇది కూడా చదవండి: రాడిసన్ హోటల్ పార్టీలో డైరెక్టర్ క్రిష్ ఉన్నట్లు నిర్ధారణ కాలేదు
