మాలిలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. మాలిలోని పశ్చిమ నగరమైన కెనిబా సమీపంలో ప్రయాణీకుల బస్సు వంతెనపై నుండి కిందపడింది. ఈ ప్రమాదంలో 31 మంది ప్రయాణికులు మరణించారు. ఈ ఘటనను మాలి రవాణా మంత్రిత్వ శాఖ ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా తెలియజేసింది. బుర్కినా ఫాసోకు వెళ్తున్న బస్సు మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో వంతెనను దాటుతుండగా ప్రమాదం జరిగినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. బస్సులో చాలా మంది మాలియన్, పశ్చిమ ఆఫ్రికా సబ్-రీజియన్ పౌరులు ఉన్నారు. “డ్రైవర్ వాహనాన్ని నియంత్రించడంలో విఫలమవడమే దీనికి కారణం” అని పేర్కొంది. బుర్కినా ఫాసోకు బస్సు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు.
మాలిలో రోడ్డు ప్రమాదాలు తరచుగా జరుగుతుంటాయి. ప్రధానంగా రోడ్డు, వాహన పరిస్థితుల కారణంగా రోడ్డు ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. అంతకుముందు ఫిబ్రవరి 19న సెంట్రల్ మాలిలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బస్సు, లారీ మధ్య జరిగిన ట్రాఫిక్ ప్రమాదంలో కనీసం 15 మంది మరణించారు. 46 మందికి పైగా గాయపడ్డారు. 2023కి సంబంధించిన UN డేటా ప్రకారం ప్రపంచంలో జరిగే ట్రాఫిక్ మరణాలలో దాదాపు నాలుగింట ఒక వంతు ఆఫ్రికాలో సంభవిస్తుంది.
ఇది కూడా చదవండి: బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం..!
