ఐపీఎస్ ఆఫీసర్ సీవీ ఆనంద్ పేరుతో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను తెరిచి సైబర్ నేరానికి పాల్పడిన నిందితుడిని ఇవాళ(బుధవారం) పోలీసులు అరెస్టు చేశారు. ఐఏఎస్, ఐపీఎస్‌ల పేర్లతో రాజస్థాన్ ప్రాంతానికి చెందన నిందితుడు జఫార్ ఖాన్ ఫేస్బుక్ ఖాతాలను సృష్టించాడు. అదేవిధంగా ఎంపీ, ఎమ్మెల్యేల పేరుతో నకిలీ ఖాతాలను తెరిచి తనకు డబ్బు పంపాలని పలువురికి మెజేస్‌లు కూడా పంపాడు. రాష్ట్రంలో ప్రముఖుల ఫొటోలను ప్రొఫైల్ పిక్‌గా పెట్టి సామాన్యులను మోసం చేస్తున్న జఫార్ఖాన్ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత నిందితుడు జఫార్ ఖాన్‌ను రిమాండ్‌కు తరలించారు.
ఇది కూడా చదవండి: గుజరాత్ తో పట్టుబడిన అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా.. భారీగా డ్రగ్స్ స్వాధీనం
