అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టురట్టైంది. గుజరాత్‌లోని పోర్‌బందర్ సమీపంలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్టు ఇండియన్ నేవీ ఇవాళ(బుధవారం) తెలిపింది. నిఘా వర్గాల సమాచారం మేరకు సముద్రంలో రెండు రోజుల పాటు ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే అనుమానాస్పదంగా కనపడ్డ ఓ నౌకను ఆపి తనిఖీ చేయగా..3300 కిలోల డ్రగ్స్ పట్టుబడ్డట్టు తెలిపింది.దీంతో పాటు ఐదుగురు విదేశీయులను అరెస్టు చేశారు. అందులో3089 కిలోల గంజాయి, 158 కిలోల మెథాఫెంటమైన్, 25 కిలోల మార్ఫిన్ ఉన్నట్టు చెప్పారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు రూ.2000 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇండియన్ నేవీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ), గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్)లు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. ఓడలోని సిబ్బందిని మొత్తం అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల కాలంలో ఇదే అతిపెద్ద డ్రగ్స్ సీజ్ అని ఇండియన్ నేవీ తెలిపింది.
ఇది కూడా చదవండి:ఘోర రోడ్డు ప్రమాదం.. బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ బస్సు.. 31 మంది దుర్మరణం.!
