రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదయ్యింది. మొత్తం 11,062 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ను సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ(గురువారం) విడుదల చేశారు. వీటిలో స్కూల్ అసిస్టెంట్ 2,629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ (స్పెషల్ ఎడ్యుకేషన్) 796 పోస్టులు ఉన్నాయి. మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. దరఖాస్తు చేసుకునేవారు ఫీజు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.
డీఎస్సీ రాత పరీక్షలను కంప్యూటర్బేస్డ్ టెస్ట్ పద్ధతిలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డిలో పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే పరీక్షలు ఎప్పుడు ఉంటాయనే విషయాన్ని ప్రకటించలేదు. కాగా, రాష్ట్రంలో గత ఏడాది 5,089 టీచర్ల భర్తీకి జారీ చేసిన పాత డీఎస్సీ నోటిఫికేషన్ను రద్దు చేసింది. అప్పట్లో దరఖాస్తు చేసుకున్న వారు తాజాగా మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. మరింత పూర్తి సమాచారం కోసం https://schooledu.telangana. వైబ్ సైట్ లాగాన్ కావాల్సిందిగా సూచించారు అధికారులు.
ఇది కూడా చదవండి: అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్లకు నిధులు విడుదలచేయండి
