జమ్ము కశ్మీర్ ముస్లిం కాన్ఫరెన్స్ లోని రెండు సంస్థలపై బుధవారం కేంద్రం వేటు వేసింది. అబ్దుల్ ఘనీ భట్, గులాం నబీ సుమ్జీల నేతృత్వంలోని ఎంసిజెకె-బి, ఎంసిజెకె-ఎస్ సంస్థలపై ఉపా చట్టం కింద రద్దు చేస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ సంస్థలు దేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు వ్యతిరేకంగా కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్షా ఎక్స్ లో ప్రకటించారు. రెండు సంస్థలపై ఐదేళ్లపాటు నిషేధం విధించింది.
అబ్దుల్ ఘనీ భట్ అధ్యక్షతన ఉన్న ఎంసిజెకె-బి నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉందని, జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందని ఎంహెచ్ఎ నోటిఫికేషన్లో తెలిపింది. ఆ సంస్థ నేతలు పాకిస్థాన్, పలు సంస్థల నుండి వివిధ వనరుల ద్వారా నిధులు సేకరిస్తున్నారని, ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం, భద్రతా దళాలపై రాళ్లు రువ్వడం వంటి చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడుతున్నారని తెలిపింది. ఎంసిజెకె బి సభ్యులు తమ కార్యకలాపాల ద్వారా రాజ్యాంగం పట్ల అగౌరవాన్ని ప్రదర్శిస్తున్నారని, ఎన్నికలను బహిష్కరించాలని, ప్రజాస్వామ్య ప్రక్రియను దెబ్బతీసేందుకు యత్నిస్తోందని చెప్పింది. గులాం నబీ సుమ్జీ అధ్యక్షతన ఉన్న మరో సంస్థ ఎంసిజెకె-ఎస్ భారత్ వ్యతిరేక, పాకిస్థాన్ అనుకూల ప్రచారాన్ని నోటిఫికేషన్లో తెలిపింది.
మిర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్ ఆల్ పార్టీస్ హురియత్ కాన్ఫరెన్స్ కి చెందిన ఈ రెండు సంస్థలు గత కొన్ని ఏండ్లుగా క్రియాశీలకంగా లేవు.
ఇది కూడా చదవండి: ధర్మశాల టెస్టుకు జట్టును ప్రకటించిన బీసీసీఐ
