భద్రాచలం రామాలయంలో శ్రీరామనవవి రోజు జరిగే సీతారాముల కల్యాణ మహోత్సవానికి శుభ ముహుర్తం ఖరారు అయ్యింది. జగదభిరాముడు శ్రీరాముడికి సీతమ్మ తల్లికిఏడాదికోసారి శ్రీరామనవమి రోజు జరిగే సీతారాముల కల్యాణం మహోత్సవానికి తేదీని ఖరారు చేశారు అర్చకులు. ఏప్రిల్ 9 నుంచి 23 వరకు వసంత పక్షప్రయుక్త శ్రీరామనవమి నవాహ్నిక బ్రహ్మోత్సవాలు జరపనున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఈ వేడుకలకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారని ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల రద్ధీని పరిగణలోనికి తీసుకుని ఏప్రిల్ 9 నుంచి 23 వరకు నిత్య కల్యాణ వేడుకను నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: ఇద్దరు దాటితే… ఉద్యోగం ఔట్..!
