ప్రముఖ సినీ, జానపద నేపథ్య గాయకులు వడ్డేపల్లి శ్రీనివాస్ ఇవాళ(గురువారం) చనిపోయారు. సికింద్రాబాద్ పద్మారావునగర్‌లోని తన నివాసంలో శ్రీనివాస్ తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం మరణించారు. శ్రీనివాస్ మృతిపట్ల జానపద కళాకారులు, పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దాదాపు 100కు పైగా సాంగ్స్, ప్రైవేట్ గా ఎన్నో ఫోక్ సాంగ్స్ పాడారు. 2012లో గబ్బర్ సింగ్ సినిమాలో గన్నులాంటి పిల్ల అనే పాటతో ఆయన పాపులర్ అయ్యాడు. ఆ పాటకి గానూ ఆయన ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకున్నాడు.
ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డి మల్కాజ్‌గిరిలో పోటీ చేసి తేల్చుకుందామా
