మహారాష్ట్రకు చెందిన శివసేన (యూబీటీ) నేత, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ కొత్త పార్లమెంట్ బిల్డింగ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఫైవ్ స్టార్ జైలుగా ఉందంటూ సంచలనం సృష్టించారు. పార్లమెంట్ పని తీరు తీవ్రంగా దెబ్బతిన్నదని విమర్శించారు. ఇవాళ( గురువారం) మీడియాతో మాట్లాడిన సంజయ్ రౌత్.. ఢిల్లీలోని సెంట్రల్ విస్తా పరిస్థితిని ప్రతి ఒక్కరూ చూడాలి. ఎంపీలు ఎదుర్కొంటున్న సమస్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త పార్లమెంట్ పని చేయలేని ఫైవ్ స్టార్ జైలు లాంటిది. ప్రతిపక్ష కూటమి ‘ఇండియా బ్లాక్’ కేంద్రంలో అధికారంలోకి వస్తే చారిత్రక పాత పార్లమెంటు భవనానికి పార్లమెంట్ సమావేశాలను మార్చాలన్నది తమ పార్టీ ఉద్దేశమని తెలిపారు.
‘మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు, మన చారిత్రక పార్లమెంటులో సమావేశాలు నిర్వహిస్తామన్నారు ఎంపీ సంజయ్ రౌత్. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందన్న ప్రధాని మోడీ వ్యాఖ్యలకు సంజయ్ రౌత్ కౌంటర్ ఇచ్చారు. 543 లోక్‌సభ స్థానాలకుగాను 600 సీట్లు గెలుచుకుంటామని ప్రగల్భాలు పలికితే మహారాష్ట్ర ప్రజలు చప్పట్లు కొడతారని అన్నారు. 2024 ఎన్నికల్లో 400కు బదులు 600 సీట్లు టార్గెట్‌గా మోడీ పెట్టుకోవాలని సూచించారు.
ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డి మల్కాజ్‌గిరిలో పోటీ చేసి తేల్చుకుందామా
