కేంద్రంలోని మోదీ సర్కార్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. సిలిండర్ ధరల పెంపుపై బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన మమత, రానున్న కాలంలో రూ.2000కే సిలిండర్ అందుబాటులోకి వస్తుందని అన్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1500 నుంచి రూ.2000 వరకు పెరగవచ్చని ఫైర్ అయ్యారు. బెంగాల్లోని ఝర్గ్రామ్ జిల్లాలో గురువారం జరిగిన ఒక సభలో ప్రసంగించిన టీఎంసీ చీఫ్, నిప్పు కోసం కలపను సేకరించడానికి బిజెపి ప్రజలను బలవంతం చేస్తుందని పేర్కొన్నారు.
ఉచితంగా బియ్యం పంపిణీ చేశామని, మళ్లీ బీజేపీ గెలిస్తే గ్యాస్ ధర రూ.1,500-2,000 పెంచవచ్చని బెంగాల్ సీఎం అన్నారు. మీరు మళ్ళీ వంట కోసం ఆవు పేడ, కలపను సేకరించవలసి ఉంటుందన్నారు. పశ్చిమ బెంగాల్, గిరిజనులపై బీజేపీకి ప్రేమ లేదని మమత అన్నారు.కేంద్ర ప్రభుత్వం పంపిన కేంద్ర బృందాలు రాష్ట్రంలో మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని మమతా బెనర్జీ అన్నారు. దీంతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధుల పంపిణీని నిలిపివేసిన కేంద్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంఎన్ఆర్ఇజిఎ నిధులను లబ్ధిదారులకు అందిస్తున్నట్లే, ఏప్రిల్ 1లోగా కేంద్రం నిధులు విడుదల చేయకపోతే ప్రధాన మంత్రి ఆవాస్ యోజనకు కూడా అదే విధంగా చేస్తామని బెనర్జీ అన్నారు.
ఏప్రిల్ 1లోగా గృహ నిర్మాణ పథకానికి కేంద్రం నిధులు విడుదల చేయకుంటే నిరుపేద లబ్దిదారులకు ఎంఎన్ఆర్ఈజీఏ నిధులు విడుదల చేస్తున్నట్లే రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు.
ఇది కూడా చదవండి : ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు.. మేడిగడ్డకు బయలుదేరిన బీఆర్ఎస్ బృందం.!
