
WPL 2024, UP vs GG | ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో తొలి విజయం కోసం తంటాలుపడుతున్న గుజరాత్ జెయింట్స్ మరోసారి బ్యాటింగ్‌లో చేతులెత్తేసింది. గత రెండు మ్యాచ్‌లలో 120 రన్స్ చేయడానికి నానా తంటాలు పడ్డ ఆ జట్టు యూపీ వారియర్స్‌తో ఆడుతున్న మూడో మ్యాచ్‌లోనూ అదే తరహాలో ఆడింది. టీ20లు అంటేనే బంతిని బాదడం అని ప్రపంచవ్యాప్తంగా పొట్టి క్రికెట్ ఆడుతున్న జట్లన్నీ నెత్తీనోరు మొత్తుకుని చెబుతున్నా గుజరాత్ జెయింట్స్ మాత్రం అందుకు విరుద్ధంగా ఆడుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా యూపీ వారియర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేస్తున్న గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 142 పరుగులే చేసింది. 26 బంతుల్లో 4 బౌండరీలు, ఓ సిక్సర్ సాయంతో 35 పరుగులు చేసిన ఫొబె లిచ్‌ఫీల్డ్ ఆ జట్టులో టాప్ స్కోరర్.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేస్తున్న గుజరాత్‌కు గత మ్యాచ్‌లతో పోలిస్తే నేడు మంచి శుభారంభమే దక్కింది. లారా వోల్వార్డ్ట్ (26 బంతుల్లో 28, 4 ఫోర్లు) పుణ్యమా అని ఆ జట్టు 5 ఓవర్లలోనే 40 పరుగులు పూర్తిచేసింది. వోల్వార్డ్ట్ ధాటిగా ఆడినా కెప్టెన్ బెత్ మూనీ (16) మాత్రం ఆటతీరులో ఏ మార్పూ లేదు. వన్ డౌన్‌లో వచ్చిన హర్లీన్ డియోల్.. 24 బంతులాడి 18 పరుగులే చేసింది.
Innings Break!#GG set a
of 143 for the UP Warriorz!
Will it be enough for #UPW? We’ll find out
Scorecard
https://t.co/4LUKvUMAOB#TATAWPL | #UPWvGG | @Giant_Cricket | @UPWarriorz pic.twitter.com/gF5mvqEGnn
— Women’s Premier League (WPL) (@wplt20) March 1, 2024
13 ఓవర్లలో 83 రన్స్‌కు 3 వికెట్లు కోల్పోయిన గుజరాత్‌ను ఆష్లే గార్డ్‌నర్ (17 బంతుల్లో 30, 4 ఫోర్లు, 1 సిక్సర్) , ఫొబె లిచ్‌ఫీల్డ్ ఆదుకున్నారు. నాలుగో వికెట్‌కు ఈ ఇద్దరూ 52 పరుగులు జోడించడంతో గుజరాత్ ఆ మాత్రం స్కోరైనా చేసింది. కానీ ఆఖర్లో స్కోరును పెంచే క్రమంలో ఈ ఇద్దరూ ఔట్ అవడంతో కనీసం 150 అయినా చేస్తుందనుకున్న గుజరాత్.. 142 కే పరిమితమైంది. యూపీ స్పిన్నర్ సోఫి ఎకిల్‌స్టోన్ 3 వికెట్లు (3/20) తీయగా దీప్తి శర్మ పొదుపుగా బౌలింగ్ చేసింది.

of 143 for the UP Warriorz!

https://t.co/4LUKvUMAOB