Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

BPL 2024 | బరిషల్‌దే బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ ట్రోఫీ.. డిఫెండింగ్‌ ఛాంపియన్లకు షాక్‌-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 1, 2024No Comments

BPL 2024 | బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ (బీపీఎల్‌) – 2024 ట్రోఫీని ఫార్ట్యూన్‌ బరిషల్‌ గెలుచుకుంది. పదో సీజన్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన కొమిలియా విక్టోరియన్స్‌పై బరిషల్‌.. ఆరు వికెట్ల తేడాతో గెలిచింది.

March 1, 2024 / 09:47 PM IST
BPL 2024 | బరిషల్‌దే బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ ట్రోఫీ.. డిఫెండింగ్‌ ఛాంపియన్లకు షాక్‌

BPL 2024 | సుమారు నెలన్నరగా బంగ్లాదేశ్‌ వేదికగా జరుగుతున్న బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ (బీపీఎల్‌) – 2024 ట్రోఫీని ఫార్ట్యూన్‌ బరిషల్‌ గెలుచుకుంది. పదో సీజన్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన కొమిలియా విక్టోరియన్స్‌పై బరిషల్‌.. ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. కొమిలియా నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని బరిషల్‌.. 19 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. 2012 నుంచి జరుగుతున్న ఈ టోర్నీలో బరిషల్‌కు ఇదే తొలి ట్రోఫీ కావడం గమనార్హం.

తుదిపోరులో టాస్‌ ఓడిన కొమిలియా.. బ్యాటింగ్‌లో విఫలమైంది. ఆ జట్టులో సునీల్‌ నరైన్‌ (5), కెప్టెన్‌ లిటన్‌ దాస్‌ (16), తౌవిద్‌ హృదయ్‌ (15)తో పాటు మోయిన్‌ అలీ (3)లు చేతులెత్తేశారు. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ మహిదుల్‌ ఇస్లామ్‌ (38), ఆండ్రూ రసెల్‌ (14 బంతుల్లో 27, 4 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో కొమిలియా గౌరవప్రదమైన స్కోరు సాధించింది.

బ్యాటింగ్‌లో విఫలమైన కొమిలియా.. బౌలింగ్‌లోనూ ఏమంత ప్రభావం చూపలేకపోయింది. బరిషల్‌ ఓపెనర్లు తమీమ్‌ ఇక్బాల్‌ (26 బంతుల్లో 39, 3 ఫోర్లు, 3 సిక్సర్లు), మెహిది హసన్‌ మిరాజ్‌ (26 బంతుల్లో 29, 1 ఫోర్‌, 2 సిక్సర్లు) తొలి వికెట్‌కు 7.6 ఓవర్లలో 76 పరుగులు జోడించారు. వన్‌ డౌన్‌లో వచ్చిన కైల్‌ మేయర్స్‌ (30 బంతుల్లో 46, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడి ఆ జట్టు విజయాన్ని ఖాయం చేశాడు.

 

Historic Triumph🏆
Fortune Barishal defies the odds and revels in the ecstasy of their First-Ever BPL T20 Title! 🏏💥#Champions | #TeamSpirit | #BPL2024 pic.twitter.com/Kf1HDi3tB9

— Bangladesh Cricket (@BCBtigers) March 1, 2024

2012 నుంచి జరుగుతున్న బీపీఎల్‌లో గతేడాది ఛాంపియన్‌ కొమిలియా విక్టోరియన్స్‌ నాలుగు సార్లు టైటిల్‌ నెగ్గింది. 2015, 2019, 2022, 2023లలో ఆ జట్టే విజేతగా నిలిచింది. 2012, 2013, 2016లలో ఢాకా గ్లాడియేటర్స్‌ ట్రోఫీలు నెగ్గింది. రంగాపూర్‌ రైడర్స్‌ (2017), రాజ్‌షాహి రాయల్స్‌ (2020)లు తలా ఒకసారి విజేతగా నిలిచాయి. పదో సీజన్లో ఫార్ట్యున్‌ బరిషల్‌ కప్పును గెలుచుకుంది. 2022లో బరిషల్‌.. రన్నరప్‌గా నిలిచింది. అప్పుడు బరిషల్‌.. కొమిలియా మీదే ఓడిపోగా తాజాగా సీన్‌ రివర్స్‌ అయి బరిషల్‌ బదులు తీర్చుకుంది.



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.