నేటికాలంలో చిన్న చిన్న విషయాలకే భార్య భర్తల మధ్య మనస్పర్ధలు వస్తున్నాయి. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి చేరింది. ఈ క్రమంలోనే తొందరపాటు నిర్ణయం వల్ల విడాకులు తీసుకుంటున్న జంటలు కూడా ఎన్నో ఉన్నాయి. అంతేకాదు భార్యభర్తల మధ్య మనస్పర్థలు వస్తే..భర్త గొడవ ఎందుకులే అనుకున్నా భార్య మాత్రం ఓ పట్టు పట్టాల్సిందే అంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు. దీంతో భార్యల చేతుల్లో పొట్టు పొట్టు దెబ్బలు తింటున్న భర్తలు చాలామందే ఉన్నారట.
అయితే ఇదంతా కామన్ అయిపోయిందట. ఒక్కప్పుడు భర్త భార్యను కొడుతే…భార్యే భర్తను చితకబాదుతోంది. అయితే భార్యల చేతులు ఎక్కువగా దెబ్బలు తింటున్నది తెలంగాణలోనే అట. బయో సోషల్ స్టడీస్ రీసెర్చ్ సంస్థ అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది. దెబ్బలు తింటున్నవారిలో ఎక్కువగా తాగుబోతుు, నిరక్షరాస్యులు ఉన్నారట. దేశంలో భర్తలపై జరుగుతున్న హింసపై ఈ సంస్థ చేసిన అధ్యయనాన్ని కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రెస్ కూడా ప్రచురించింది.
గత 15ఏండ్లలో భర్తలపై దాడులు ఐదురెట్టు పెరిగియాని అధ్యయనం తెలిపింది. ప్రతి వెయ్యి మంది మహిళల్లో 36మంది భర్తలను చితకబాదుతున్నారని అధ్యయనంలో తెలిసింది. 2006లో మాత్రం ఈ సంఖ్య 7కి మాత్రమే ఉంది. మన దేశంలో మహిళలకు మాత్రమే రక్షణ చట్టాలు ఉండటం కూడా పురుషులపై గ్రుహహింస పెరగడానికి ఒక కారణమనిఅధ్యయనం పేర్కొంది. అయితే ఎక్కువగా మద్యానికి బానిసైన భర్తలు, భార్యలను వేధించడమే ప్రధానకారణమని అధ్యయనం వెల్లడించింది. అయితే ఎక్కువ మద్యానికి బానిసైన భర్తలు, భార్యలను వేధించడమే ప్రధాన కారణమని అధ్యయనంలో వెల్లడైంది.
ఇది కూడా చదవండి: కామధేనువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడుకోవాలి
The post భర్తలను భార్యలు పొట్టు పొట్టు కొట్టేది ఎక్కడో తెలుసా..!! appeared first on tnewstelugu.com.
