వరంగల్ గిర్లానిపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. విషం తాగి కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా సంచలనం రేపింది.
విషం తాగిన కుటుంబానికి చెందిన భార్య, భర్త నవధన్ (33), స్రవంతి (28) మృతి చెందగా, పెద్ద కుమారుడు వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్నారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
కుటుంబ కలహాలతో కుటుంబ సభ్యులు విషం తాగి ఆత్మహత్యకు యత్నించినట్లు స్థానికులు తెలిపారు. వీరిద్దరికి 8 ఏళ్ల క్రితం వివాహమై ఇద్దరు కుమారులు ఉన్నట్టు సమాచారం. దివంగత నవర్దన్ లోహపు కార్మికుడని తెలిపారు.
