ఇండియాలోని ఎస్ యూవీలలో హ్యుందాయ్ క్రెటాకు భారీగా డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు హ్యుందాయ్ సరికొత్త క్రెటా ఎన్ లైన్ స్పెషల్ వేరియంట్ కారును రిలీజ్ చేస్తోంది. కేవలం రూ. 25వేలు చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. ఈ కారు అత్యంత ప్రజాదరణ పొందింది. కొత్త డిజైన్, అదనపు ఫీచర్లు, అత్యుత్తమ పనితీరుతో హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ కారు విడుదలకు రెడీగా ఉంది. క్రెటా ఎన్ లైన్ కార్లలో ఈ కారు 3వ మోడల్. 2ఎన్ లైన్ మోడల్ ఇప్పటికే రిలీజ్ అయి మంచి సక్సెస్ ను అందుకుంది. ఇప్పుడు క్రెటా ఎన్ లైన్కొత్త కలర్ ఇంకా మరెన్నో అప్ డెట్స్ తో రాబోతుంది.
సరికొత్త క్రెటా ఎన్ లైన్ కారును రూ. 25వేల టోకెన్ మొత్తం చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 29 నుంచి బుకింగ్స్ అందుబాటులో ఉంటాయి. క్రెటా ఎన్ లైన్ కారు బుకింగ్ ఆథరైజ్డ్ హ్యుందాయ్ డీలర్ షిప్ సందర్శించడం ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు హ్యుందాయ్ అధికారిక వెబ్ సైట్ ద్వారా కూడా కారును బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. కొత్త క్రెటా ఎన్ లైన్ మరింత స్పోర్టీ లుక్ తో వస్తుంది. హ్యుందాయ్ ఇప్పటికే కారు ఫొటోలను రిలీజ్ చేసింది. సోషల్ మీడియాలో ఈ కారుకు మంచి ఆదరణ లభిస్తోంది. ఫిబ్రవరి 29 నుంచి బుకింగ్స్ ప్రారంభించిన హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ కారు మార్చి 11 రిలీజ్ కానుంది. ఎన్ లైన్ బ్యాడ్జ్ ఉన్న ఈ కారులో ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.
ఫ్రంట్ గిల్ రీ డిజైన్ చేసింది. అంగుళర్ డిజైన్ బంపర్, అదనపు వైడ్ ఎయిర్ ఇల్ లైట్స్ కారు అందాన్ని మరింత పెంచాయి. హెడ్ ల్యాండ్ లు ఇంకా డే టైం రన్నింగ్ ఎల్ఈడీ లలో ఎక్కువగా తేడా లేదు. కొత్త కారు ధర రూ. 17.50లక్షల నుంచి ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ 160 బీహెచ్పీ శక్తిని, 253ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.
ఇది కూడా చదవండి: మరోసారి వారణాసి నుంచి ఎన్నికల బరిలోకి ప్రధాని మోదీ.!
