పాకిస్థాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. పీఎంఎల్ ఎన్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీల తరపున అభ్యర్థిగా ఉన్న షెహబాజ్..జాతీయ అసెంబ్లీలో ఆదివారం నిర్వహించిన ఓటింగ్ లో మొత్తం 336 ఓట్లకు 201 ఓట్లు వచ్చాయి. పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ అభ్యర్థి ఒమర్ అయూభ్ ఖాన్ కు 92 ఓట్లు మాత్రమే వచ్చినట్లు పాక్ మీడియా వెల్లడించింది.
ఓటింగ్ సందర్భంగా పీటీఐ సపోర్టుగల చట్ట సభ్యుల నినాదాలతో పార్లమెంటులో గందరగోళ వాతావరణం ఏర్పడింది. షెహబాజ్ సోమవారం అధ్యక్ష భవనంలో దేశ 33వ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. 2022 ఏప్రిల్ లో ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతుడైన అనంతరం మొదటిసారి ప్రధాని బాధ్యతలను చేపట్టిన షరీఫ్ ..గత ఏడాది ఆగస్టు వరకు సంకీర్ణ సర్కార్ కు సారథ్యం వహించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 8న సార్వత్రిక ఎన్నికలు నిర్వహించారు.
ఇది కూడా చదవండి : అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ కు 400 చార్టర్డ్ ఫ్లైట్స్..!
The post పాకిస్తాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ఎన్నిక.! appeared first on tnewstelugu.com.
