కర్ణాటకలోని మంగళూరులో దారుణం జరిగింది. దక్షిణ కన్నడ జిల్లాలోని కడబాలోని ప్రభుత్వ పీయూ కాజేజీలో విద్యార్థినిపై యాసిడ్ దాడి జరిగింది. ఈ దాడిలో విద్యార్థినితో పాటు ఆమె స్నేహితులకు కాలిన గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన అబిన్ (23) స్థానికులు పట్టుకుని.. పోలీసులకు అప్పగించారు. గాయపడిన ముగ్గురూ విద్యార్థునులు సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కేరళలోని మలప్పురం జిల్లా నిలంబూర్ తాలూకాకు చెందిన అబిన్ (23) కేరళకు చెందినవాడని, ఎంబీఏ చదువుకున్నాడని తెలిపారు. అతనికి బాధితురాలితో గతంలో పరిచయం ఉందన్నారు. నిందితుడు అబిన్ బాధితురాలు కేరళలో ఒకే ప్రాంతంలో ఉండేవారని తెలిపారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉందని.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి: ఎంపీ, ఎమ్మెల్యేల లంచాల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు
