సీఎం రేవంత్ రెడ్డి మోడీని బడా బాయ్ అంటున్నారు. గుజరాత్ మోడల్ ను తెలంగాణ లో అమలు చేస్తామంటున్నారు.రేవంత్ రెడ్డి మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని నిస్సిగ్గుగా ,నిర్లజ్జగా మాట్లాడుతున్నారు.రేవంత్ రెడ్డి ఓ పాథాలజికల్ లయర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు హైదరాబాద్ ఇంచార్జ్ దాసోజు శ్రవణ్. ఇవాళ(మంగళవారం) హైదరాబాద్ తెలంగాణ భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు.అబద్దాల పునాదుల మీద కాంగ్రెస్ పాలన చేస్తోంది.రేవంత్ రెడ్డి కొత్తగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ లు కూడా అందులో కలుపుతున్నారు. ఎన్నికల్లో అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారు..ఇపుడు అవే అబద్దాలు చెబుతున్నారు. రేవంత్ సమర్థుడవైతే కొత్తగా ఉద్యోగాలు సృష్టించు.రేవంత్ నయవంచనకు పరాకాష్ట 30 వేల ఉద్యోగాలు ఇచ్చాను అనడం. 30 వేల ఉద్యోగాలకు ఎపుడు నోటిఫికేషన్లు వచ్చాయో ప్రభుత్వం దగ్గర రికార్డులు ఉన్నాయన్నారు.
తెలంగాణ సమాజం రేవంత్ తీరును గమనించాలన్నారు దాసోజు శ్రవణ్.కేసీఆర్ హయాంలో లక్షా 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశారు. పదే పదే అబద్దాలు చెప్పి రేవంత్ లేకితనం ప్రదర్శిస్తున్నారు. దేశం లో ఎన్నడూ లేని నిరుద్యోగం ఉంది. రేవంత్ కు చిత్తశుద్ధి ఉంటే కొత్త ఉద్యోగాలను భర్తీ చేయాలి. ఉద్యోగాల ఖాళీలపై శ్వేత పత్రం ప్రకటించాలి. రేవంత్ తాను సీఎంను అనే సంగతి మరచి పోయి మాట్లాడుతున్నాడు. నిరుద్యోగ యువత రేవంత్ ను నిలదీయాలి. రేవంత్ చేపలు, గొర్రెల పంపిణీ గురించి కుల వృత్తులను అవమాన పరిచేలా మాట్లాడారు .కాంగ్రెస్ మేనిఫెస్టో లోనే గొర్రెల పంపిణీ గురించి ప్రస్తావించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో లో ఏముందో కూడా రేవంత్ కు తెలియదు. రేవంత్ ఆధిపత్య ధోరణి తో మాట్లాడుతూ బీసీలను అవమాన పరుస్తున్నారు. చేపలు ,గొర్రెల పంపిణీ తో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రూపు రేఖలే మారాయి.మోడీ ని బడే బాయ్ అంటున్నరు రేవంత్. రాహుల్ గాంధి… ఓ వైపు మోడీ ని దించేయాలని చూస్తుంటే రేవంత్ ఆయనే ప్రధాని గా ఉండాలని కోరుకుంటున్నారు. రేవంత్, మోడీ ల మధ్య ఒప్పందం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.
అంతేకాదు ..కాంగ్రెస్ బీజేపీల మధ్య తెలంగాణలో చీకటి ఒప్పందం ఏమిటో కూడా చెప్పాలన్నారు చెప్పాలన్నారు దాసోజు శ్రవణ్. గుజరాత్ మోడల్ అబద్దాల మోడల్ అని కాంగ్రెస్ అధిష్టానం అంటే ..రేవంత్ దాన్ని గొప్ప మోడల్ అంటున్నారు. రేవంత్ దృష్టిలో గుజరాత్ మోడల్ అంటే తెలంగాణ ను గోధ్రా గా మార్చడమా అని ప్రశ్నించారు. ఎలా మాట్లాడాలో రేవంత్ కు సోనియా,ఖర్గే నేర్పాలన్నారు.మూడో సారి మోడీ ని ప్రధాని చేయాలని రేవంత్ తపిస్తున్నారు. రేవంత్ నేతృత్వం లోని కాంగ్రెస్ మోడీ బంధాన్ని మైనారిటీ సోదరులు గమనించాలి. రేవంత్ ఇకనైనా అబద్దాలు మాట్లాడటం మాని పాలన పై ద్రుష్టి సారించాలని సూచించారు.
ఇది కూడా చదవండి: బోధన్ హాస్టల్ ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణం
The post రేవంత్.. సమర్థుడివైతే కొత్తగా ఉద్యోగాలు సృష్టించు appeared first on tnewstelugu.com.
