Road accident | ఈ (బుధవారం) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో కారులో ఉన్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని నల్లగుట్ట వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Road accident : ఈ (బుధవారం) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో కారులో ఉన్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని నల్లగుట్ట వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. మృతులంగా హైదరాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. వారంతా తిరుపతికి వెళ్లి వస్తుండగా ప్రమాదం బారిన పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
