తెలంగాణాలో 10వ తరగతి హాల్ టికెట్లు రేపు(గురువారం) విడుదల కానున్నాయి. ఈ నెల 18 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రింటెడ్ హాల్ టికెట్లను ఆయా స్కూళ్లకు పంపించారు అధికారులు. అలాగే స్కూళ్ల యజమాన్యంతో సంబంధం లేకుండా వెబ్ సైట్ నుంచి విద్యార్థులు నేరుగా హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు.
పదవతరగతి పరీక్షలకు ఈ ఏడాది 2,676 సెంటర్లను ఏర్పాటు చేయగా..5.08 లక్షల మంది విద్యార్ధులు హాజరుకానున్నారు.
ఇది కూడా చదవండి: మరీ ఇంత ఫ్రెండ్లీ పోలీసింగా.. హత్య కేసు నిందితుడికి పోలీస్ స్టేషన్ లో బర్త్ డే వేడుకలు
