తమిళనాడులోని తిరువరూర్‌కు చెందిన విజయకుమార్ అనే రైతు ‘కరుప్పు కవుని’ అనే రకం వరి పండిస్తున్నారు. బ్లాక్ రైస్‌గా కూడా పిలిచే ఈ వరిని పూర్వం తమిళ రైతులు ఎక్కువగానే పండించేవారు. కాలక్రమంలో ఈ వరిని పండించడం ఆగిపోయింది.
ఈ బియ్యం లో ఆరోగ్యానికి మేలు చేసే అనేక గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా శరీరంలో క్యాన్సర్ కణాలు తయారుకావనే నమ్మకం ఉంది. చర్మ క్యాన్సర్ రాకుండా ఈ బియ్యం నియంత్రిస్తుందని చాలామంది నమ్మకం. పలు అధ్యయనాల్లోనూ మిగతా రకాల బియ్యంతో పోలిస్తే కరుప్పు కవుని బియ్యంలో యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు ఎక్కువగా ఉన్నట్టు తేలింది. దీంతో గత పదేండ్లుగా ఈ వరిని పండిస్తున్నారు విజయ కుమార్.
ఇది కూడా చదవండి: మరీ ఇంత ఫ్రెండ్లీ పోలీసింగా.. హత్య కేసు నిందితుడికి పోలీస్ స్టేషన్ లో బర్త్ డే వేడుకలు
