ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఇప్పుడు కష్టాలు పెరుగుతున్నాయి. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు మళ్లీ కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో సమన్లను పాటించనందుకు ఈడీ రెండో ఫిర్యాదుపై కేజ్రీవాల్‌కు తాజాగా సమన్లు జారీ అయ్యాయి. మార్చి 16న హాజరుకావాలని ఆదేశించింది.
మనీలాండరింగ్ విచారణలో సమన్లను పాటించనందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ప్రాసిక్యూషన్ కోరుతూ ఈడీ తాజాగా కోర్టులో ఫిర్యాదు చేసింది. కొత్త ఫిర్యాదు PMLA సెక్షన్ 50 కింద ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్‌కు ED పంపిన 4 నుండి 8 సమన్ల సంఖ్యలను పాటించకపోవడానికి సంబంధించినది.మార్చి 4న ఈడీ కేజ్రీవాల్‌ను విచారణకు పిలిచింది. విచారణకు హాజరవ్వాల్సిందిగా ఈడీ కేజ్రీవాల్‌ను కోరింది. కానీ ఆయన ఈడీ కార్యాలయానికి వెళ్లలేదు. ఈ వ్యవహారం కోర్టులో ఉన్నప్పుడు మళ్లీ మళ్లీ ఈడీ ఎందుకు సమన్లు పంపుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది.
మార్చి 12 తర్వాతే వర్చువల్ గా హాజరవుతానని షరతు పెట్టారు. దీంతో ఈడీ మరోసారి కోర్టను ఆశ్రయించింది. ఈ క్రమంలోనే న్యాయస్థానం తాజాగా ఆయనకు సమన్లు జారీచేసింది. మద్యంకుంభకోణం కేసులో ఇప్పటికే సీబీఐ, కేజ్రివాల్ నువిచారించింది. గతేడాది ఏప్రిల్ లో ఆయనను 9 గంటల పాటు ప్రశ్రించారు. ఇప్పుడు ఈడీ నమోదు చేసిన కేసులోనూ ఆయనకు సమన్లు అందాయి.
ఇది కూడా చదవండి: జెలెన్ స్కీ కాన్వాయ్ లక్ష్యంగా క్షిపణి దాడి.!
