మావోయిస్టులతో సంబంధాలున్నాయినే ఆరోపణలతో అరెస్టయిన ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్. సాయిబాబా గురువారం జైలు నుండి విడుదలయ్యారు. ఆయనతో పాటు మరో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ మంగళవారం బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. నాగపూర్ సెంట్రల్ జైలు నుండి ఇవాళ ఆయన విడుదలయ్యారు.
మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ 90 శాతం వైకల్యంతో వీల్ చైర్‌కు పరిమితమైన సాయిబాబాను 2014లో మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఈ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ)కి అప్పగించింది. 2017 మార్చిలో గడ్చిరోలి సెషన్స్ కోర్టు సాయిబాబాకు జీవిత ఖైదు విధించింది. అప్పటి నుండి ఆయన నాగపూర్ సెంట్రల్ జైలులోనే ఉన్నారు. మధ్యలో 2014 నుండి 2016 వరకు బెయిల్‌పై విడుదలయ్యారు.
ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి షాక్.. కోదండరాం, అలీఖాన్ నియామకం చెల్లదన్న హైకోర్టు
