బీఅర్ఎస్ పార్టీ గెలిస్తెనే…తెలంగాణ నిలుస్తుందన్నారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు. తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం పోరాడే ఏకైక పార్టీ బీఅర్ఎస్ పార్టీ అని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించాలన్నారు. ఓట్ల కోసం అడ్డగోలుగా హామీలు ఇచ్చినా..కాంగ్రెస్ పార్టీ కి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. నారాయణఖేడ్ లో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు హరీశ్ రావు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందన్నారు. 2లక్షల రుణమాఫీ నుండి ఎన్నో హామీలను కాంగ్రెస్ పక్కన పెట్టింది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకు ప్రజలు ఓట్లతో బుద్ధి చెప్పాలి. మోడీ ఆశీర్వాదం కావాలని చెప్పడం ద్వార…కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు….రాహుల్ గాంధీ ప్రధాని కాడు అని రేవంత్ రెడ్డి చెబుతున్నాడు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రైతుబంధుతో సహా అన్ని పథకాల్లో కోత పెడుతారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పనిచేసే బీఅర్ఎస్ పార్టీ నే గెలిపించాలి.బీఅర్ ఎస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ చేయని హామీల గురించి గ్రామ గ్రామాన విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు హరీశ్ రావు.
ఇది కూడా చదవండి: మాపై కోపంతో అన్నదాతల నోట్లో మట్టికొట్టొద్దు
