మ్యారేజ్ తర్వాత పిల్లలకు జన్మనివ్వడం సాధారంగా జరిగేదే. కాని బిడ్డకు జన్మనివ్వాలంటే ఓ వింత షరతు పెట్టింది ఓ భార్య. ఆ షరతు కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దుబాయిలో ఉండే ఓ మిలియనీర్ భార్య సౌదీ బిడ్డను కనేందుకు వింత షరతు పెట్టింది. తనకు నెలకు రూ.2.5 కోట్లు ఇస్తేనే తన భర్తతో బిడ్డను కంటానని ఆమె ప్రకటించారు. ఉచితంగా తాను పురిటి నొప్పులు భరించాలని అనుకోవట్లేదని నిర్మొహమాటంగా చెప్పిందట. తాను గర్భం దాల్చకముందే తనకు, తన భర్తకు దీనికి సంబంధించిన ఒప్పందం కుదిరిందని ఆమె చెప్పింది. అంతేకాదు..డెలివరీ తర్వాత పుట్టిన బిడ్డను చూసేందుకు కనీసం 1000 నుంచి 2000 మంది చూసేందుకు వచ్చే అవకాశం ఉన్నందున తనకు ప్రత్యేక వీఐపీ గదిని కూడా ఏర్పాటు చేయాలని సౌదీ తన భర్తను కోరారు.
అలాగే పుట్టిన బిడ్డ అవసరాల కోసం నెలకు అదనంగా మరో రూ.2.50 కోట్లు ఇవ్వాలని కోరింది. ఒకవేళ ఇద్దరు పిల్లలకు జన్మనివ్వాలంటే ఈ ధర రెట్టింపు అవుతుందని ఆమె తన భర్తకు షరతు పెట్టింది. అలాగే ఇంట్లో పనివాళ్ల సంఖ్యను రెట్టింపు చేయాలని, ప్రత్యేకంగా నైట్ నర్స్ ను నియమించాలని తెలిపింది. బిడ్డ కారణంగా రాత్రుల్లో తన నిద్రకు భంగం కలగకుండా ఆ నర్సు పని చేస్తుందని తెలిపింది.
ఇది కూడా చదవండి: మహబూబ్‌నగర్ వెనుకబాటుతనానికి నాటి టీడీపీ, కాంగ్రెస్ పాలనే
