కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఒక్క నిమిషం కూడా కరెంట్ పోలేదు. పెట్టుబడి కరెంట్ లేకుండా చేశారని తెలిపారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు. మార్చ్ నెల వచ్చిన కూడా ఇంకా కాంగ్రెస్ రుణమాఫీ చేయలేదు, బోనస్ ఇవ్వలేదు. రైతు బంధు, రుణమాఫీ, బోనస్ ఇస్తామని కాంగ్రెస్ దగా చేసింది. మోడీని బడే భాయ్ ఎప్పటికి మాకు ఆశీర్వాదం ఉండాలి అంటాన్నాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి అర్ధమైంది ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం రాదూ అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడే చెప్పిండన్నారు.
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలన్నారు హరీశ్ రావు. కాంగ్రెస్ ని ఒడిస్తేనే రైతుబంధు వస్తుందన్నారు. కాంగ్రెస్ ఒడిస్తేనే రైతు రుణమాఫీ అవుతుందన్నారు. రైతులందరు సంఘటితంగా ఉండి కాంగ్రెస్ పార్టీని ఓడించాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో ప్రతిపక్ష హుదా కూడా వచ్చే అవకాశం లేదన్నారు. అసెంబ్లీలో మీ కోసం గట్టిగ కొట్లాడినామా లేదా? అని ప్రశ్నించారు. మీ పక్షాన్న గట్టిగ కొట్లాడాలాంటి మీ గొంతుకుగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదేనని చెప్పారు హరీశ్ రావు.
ఇది కూడా చదవండి:ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకునేందుకు ఈ నెల 14 వరకు గడువు
