కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే రాష్ట్రంలో కరువు కనిపిస్తుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో నిర్వహించిన కార్యకర్తల సమన్వయ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. బీఆర్ఎస్ కు ఓటు వేయనందుకు బాధపడతున్నామంటూ కేటీఆర్ ముందు గోడు వెళ్లబోసుకున్నారు రైతులు. కాళేశ్వరం పై కావాలనే కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. 83 పిల్లర్లలో 3 పిల్లర్లను కాంగ్రెస్ రిపేర్ చేయించకలేకపోతుందంటూ కేటీఆర్ విమర్శించారు.
కేసీఆర్ అధికారంలో ఉంటే తెలంగాణ పరిస్థితి ఇలానే ఉండేదా అంటూ ప్రశ్నించారు. వెంటనే మేడిగడ్డ రిపేర్ చేసి రైతులకు నీళ్లందంచాలన్నారు. అబద్దాలు చెప్పి ఎన్నికల ముందు ప్రజలను రెచ్చగొట్టారన్నారు కేటీఆర్. అసలు సీఎం మాదిరి రేవంత్ వ్యవహరిస్తున్నారా అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. రేవంత్ భాష చూస్తుంటే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. రేవంత్ కు రైతుల మీద ప్రేమ లేదన్నారు. రైతుల మీద ప్రేమ ఉంటే ఇప్పటికే మేడిగడ్డ మరమ్మత్తు అయ్యేదన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి రేవంత్ సాగునీరు ఇచ్చి రైతులను ఆదుకోవాలని కేటీఆర్ కోరారు.
ఇది కూడా చదవండి: జొమాటో సరికొత్త నిర్ణయం.. మహిళా ఉద్యోగులకు కుర్తా యూనిఫాం
