ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకుండా లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్)అమలు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ కు ఆయన లేఖ రాశారు. ఎల్ఆర్ఎస్ అంటే దోపిడి అని గతంలో మీరు అన్నారు. ఇవాళ ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను ఎందుకు దోపిడీ చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రజల కోరిక మేరకు ఈ స్కీంను ఫ్రీగా అమలు చేయాలన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని మీరు అసెంబ్లీలో చెప్పిన మాట వాస్తవమే అయితే వెంటనే మార్గదర్శకాలు విడుదల చేయాలంటూ లేఖలో పేర్కొన్నారు కేటీఆర్.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే..రాష్ట్రంలో కరువు:కేటీఆర్
The post LRSపై సీఎం రేవంత్ కు మాజీ మంత్రి కేటీఆర్ లేఖ.! appeared first on tnewstelugu.com.
