SL vs BAN : ప్రపంచ క్రికెట్లో కొన్ని జట్ల మధ్య, ఆటగాళ్ల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉంటాయి. ఆటగాళ్ల మధ్య కవ్వింపు చర్యలు, స్లెడ్జింగ్ వంటివి అలాంటివే. నిరుడు వన్డే వరల్డ్ కప్‌లో ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్(Aanjelo Mathews) టైమ్డ్ ఔట్‌తో శ్రీలంక, బంగ్లాదేశ్‌ల మధ్య మొదలైన గొడవ…
SL vs BAN : ప్రపంచ క్రికెట్లో కొన్ని జట్ల మధ్య, ఆటగాళ్ల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉంటాయి. ఆటగాళ్ల మధ్య కవ్వింపు చర్యలు, స్లెడ్జింగ్ వంటివి అలాంటివే. గత కొన్ని రోజులుగా ‘టైమ్డ్ ఔట్'(Timed Out) వివాదం వార్తల్లో నిలుస్తోంది. నిరుడు వన్డే వరల్డ్ కప్‌లో ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్(Aanjelo Mathews) టైమ్డ్ ఔట్‌తో శ్రీలంక, బంగ్లాదేశ్‌ల మధ్య మొదలైన గొడవ ఇంకా సద్దుమణగలేదు. తాజాగా మూడో టీ20లో బంగ్లాను ఓడించిన లంక.. టైమ్డ్ ఔట్ సిగ్నల్‌తో బదులిచ్చింది.
ఈ మ్యాచ్‌లో లంక పేసర్ నువాన్ తుషార హ్యాట్రిక్ వికెట్లతో బంగ్లాను దెబ్బకొట్టాడు. దాంతో లంక 28 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. అనంతరం కెప్టెన్ వనిందు హసరంగ జట్టు సభ్యులకు ట్రోఫీ అందించాడు. అప్పుడు లంక ఆటగాళ్లంతా టైమ్డ్ ఔట్ గెశ్చర్‌తో బంగ్లాను టీజ్ చేశారు. తమ ఎడమ చేతి మణికట్టుపై కుడిచేతి చూపుడు వేలిని పెట్టి.. ‘టైమ్డ్ ఔట్’ సెలబ్రేషన్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Time out celebration 😂 pic.twitter.com/ijFTqhDu1Z
— SRI LANKA CRICKET LIONS (@slcricketlions) March 9, 2024
తొలి టీ20లో బంగ్లా పేసర్ షొరిఫుల్(Shoriful Islam) ఇస్లాం లంక ఓపెనర్ అవిష్క వికెట్ తీసి టైమ్డ్ ఔట్ సెలబ్రేషన్ చేసుకున్నాడు. దాంతో, చిర్రెత్తుకొచ్చిన లంక ఆటగాళ్లు 2-1తో సిరీస్ గెలిచిన అనంతరం అదే తరహా సెలబ్రేషన్‌తో బంగ్లాకు కౌంటర్ ఇచ్చారు. మ్యాచ్ అనంతరం ఈ ఘటనపై బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హుసేన్ శాంటో స్పందించాడు. లంక ఆటగాళ్లు ఇంకా టైమ్డ్ ఔట్ వివాదం నుంచి బయటకు రాలేదు. వాళ్లు వర్తమానంలో ఉండాలి అని లంక జట్టుకు శాంటో సూచించాడు.
Shoriful Islam Timed-out Celebration pic.twitter.com/fkPGrIVjei
— SRI LANKA CRICKET LIONS (@slcricketlions) March 4, 2024
తొలి క్రికెటర్‌గా రికార్డు..
వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన లీగ్ దశ మ్యాచ్‌లో మాథ్యూస్ టైమ్డ్ ఔట్ అయ్యాడు. దాంతో, ఈ విధంగా ఔటైన తొలి క్రికెటర్‌గా అతడు రికార్డు సృష్టించాడు. అసలు ఏం జరిగిందంటే.. షకీబల్ హసన్ వేసిన 25వ ఓవర్లో సమరవిక్రమ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన మాథ్యూస్.. హెల్మెట్ సరిగ్గా లేకపోవడాన్ని గుర్తించాడు. వెంటనే డగౌట్లో ఉన్న సహచరులకు సైగ చేసి హెల్మెట్ తీసుకురమ్మన్నాడు.

ఐసీసీ రూల్స్ ప్రకారం కొత్త బ్యాటర్ 2 నిమిషాలలోపే క్రీజులోకి రావాలి. కానీ, మాథ్యూస్ హెల్మెట్ బాగా లేదని ఆగిపోయాడు దాంతో, టైమ్ వేస్టు కావడాన్ని గుర్తించిన బంగ్లా కెప్టెన్ షకీబ్ ‘హౌ ఈజ్ దట్’ అంటూ అప్పీల్ చేశాడు. దీంతో లెగ్ అంపైర్‌తో చర్చించిన అంపైర్ మాథ్యూస్‌తో మాట్లాడాడు. అప్పటికే నిర్ణీత సమయం మించిపోవడం, మాథ్యూ స్ గార్డ్ తీసుకోకపోవడంతో అతడిని ఔట్‌గా ప్రకటించాడు.
