మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మనందరం చేదు అనుభవం చూశాం.. గతం గతః భవిష్యత్తు మాత్రమే మాట్లాడుకుందామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కామారెడ్డి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి ముందుకు వెళ్దాం. రానున్న రోజుల్లో మనకు పూర్వ వైభవం వస్తుంది. ఆ నమ్మకం నాకుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా అర్థ రాత్రి చేనుకు వెళ్ళే పరిస్థితి కాంగ్రెస్ వచ్చిన తర్వాత వచ్చిందని కొందరు రైతులు చెప్పారు. రైతులకు మంచి చేసిన బీఅర్ఎస్ పార్టీని ఓడించుకున్నామని కొందరు మాట్లాడుకోవడం చూస్తున్నాం. గత శాసన సభ ఎన్నికల్లో ప్రతి పక్ష పార్టీల అసత్య ప్రచారాలు చేసి అమలు కానీ హామీలు ఇచ్చి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి లో బీజేపీ గెలిచింది. 109 స్థానాల్లో 39 స్థానాలు మన పార్టీని గెలిపించి ప్రతిపక్ష హోదాను ప్రజలు ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన తీర్పును మేము తప్పక స్వీకరిస్తామన్నారు.
మోసగాళ్లల్లో నిజాయతీ గల మోసగాడు రేవంత్ రెడ్డి అని అన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి చెప్పిన మోసపూరిత మైన మాటలు విని ప్రజలు రేవంత్ రెడ్డి ని గెలిపించారు. అమలు కానీ హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడింది. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి బొంద తీసుడే, ఊరుకునేది లేదన్నారు. రైతుల పైన నిజమైన ప్రేమ రేవంత్ రెడ్డికి ఉంటే ఈ యసంగికి పంటకు 500 బోనస్ ఇచ్చే జీవో పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముందే తీసుకురావాలన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడకుండా కేసీఅర్ పట్ల దిగజారు మాటలు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి నీలాగా ఆంధ్ర నాయకుల బూట్లు నాకి నేను రాజకీయాల్లోకి రాలేదు. ఉద్యమ నాయకుడు నా అయ్య కేసీఅర్.. ఆయన కొడుకుగా వచ్చి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అని రేవంత్ కు దిమ్మదిరిగేలా చెప్పారు కేటీఆర్. రేవంత్ రెడ్డి నీవు నిజమైన మగాడివైతే ఆడబిడ్డలకు 2500 పెన్షన్లు ఇవ్వు. రైతులకు రుణమాఫీ చేయ్యన్నారు.
కాళేశ్వరం ద్వారా రోజుకు రెండు టీఎంసీల నీరు లిఫ్ట్ చేయడం జరుగుతుందన్నారు కేటీఆర్. ఈ మూడు నెలల్లో కుంగిన మూడు మేడి గడ్డ పిల్లర్లను సరిచేస్తే రైతులకు సాగు నీరు వస్తుండే కదా అని ప్రశ్నించారు. రైతులకు, ప్రజలకు అవసరమైన పనులు చేయకుండా రాజకీయంగా విమర్శించడం కోసమే రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించుకుందామన్నారు కేటీఆర్.
ఇది కూడా చదవండి: అధికారిక మీటింగ్ లోనూ కరెంట్ కోత.. వీడియో షేర్ చేసిన ఎమ్మెల్సీ కవిత
