ఇండోనేషియాలో ఇవాళ(ఆదివారం) దారుణం జరిగింది. సుమత్రా దీవుల్లో ఎడతెరిపి లేని కుండపోత వానలు, ఆకస్మిక వరదలతో కొండచరియలు విరిగిపడి 19 మంది మృతి చెందగా, ఏడుగురు గల్లంతయ్యారు. వరదలతోపాటు కొండచరియలు విరిగిపడటంతో 14 ఇండ్లు నేలమట్టమయ్యాయి. 80 వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
కుండపోత వానలు, ఆకస్మిక వరదల ధాటికి సుమత్రా దీవుల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో గల్లంతైనవారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు. విపత్తు నిర్వహణ ఏజెన్సీలు ఘటనా స్థలంలో సహాయ చర్యలను వేగవంతం చేస్తున్నాయని చెప్పారు. ప్రమాద ప్రాంతంలోని ప్రజలను అక్కడి నుండి సురక్షితంగా తరలించారు. గాయపడినవారందరినీ వెంటనే ఆసుపత్రికి తరలించారు. టన్నుల కొద్దీ మట్టి, రాళ్లు, నేలకూలిన చెట్లు నివాస ప్రాంతాల్లోకి చేరుకున్నాయని తెలిపారు. పశ్చిమ సుమత్రా ప్రావిన్స్ లోని పెసిసిర్ సెలాటాన్ జిల్లాలో పలుచోట్ల కొండచరియలు విరిగిపడి గ్రామాల్లో విధ్వంసం సృష్టించాయన్నారు.
ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డి.. నీలాగా ఆంధ్ర నాయకుల బూట్లు నాకి రాజకీయాల్లోకి రాలే
