ప్రపంచవ్యాప్తంగా సినీప్రేమికుల ఎంతో ఆత్రుతతో ఎదురుచూసే ఆస్కార్ 2024 వేడుక అట్టహాసంగా ప్రారంభం అయ్యింది. సినీరంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల వేడుక లాస్ ఏంజిల్స్ లని డాల్బీ థియేటర్ లో షురూ అయ్యింది. ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి సినీతాలు హాజరయ్యారు. విభాగాల వారీగా అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఓపెన్ హైమర్, పూర్ థింగ్స్ సినిమాలకు అవార్డుల పంట పండింది. అత్యధిక అవార్డులను ఇవి గెలుచుకున్నాయి.
ఈసారి ‘ఓపెన్‌హైమర్’ చిత్రానికి గాను కిలియన్ మర్ఫీ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు.అదే చిత్రానికి గాను రాబర్ట్ డౌనీ జూనియర్ ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్ అందుకున్నారు. అతని కెరీర్‌లో ఇదే తొలి ఆస్కార్. ‘పూర్ థింగ్స్’ చిత్రం నాలుగు విభాగాల్లో ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది. ‘ఓపెన్‌హైమర్’ ఇప్పటి వరకు చాలా విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది. ఈ సినిమా చాలా కేటగిరీల్లో నామినేషన్లు అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా ‘ఐరన్ మ్యాన్’ అని కూడా పిలువబడే నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్ ఆస్కార్ 2024లో కనిపించారు.
విజేతల పూర్తి జాబితాను ఇక్కడ చూడండి…
ఆస్కార్ 2024 విజేతల జాబితా-
ఉత్తమ నటి – ఎమ్మా స్టోన్
ఉత్తమ నటుడు – సిలియన్ మర్ఫీ
ఉత్తమ దర్శకత్వం – క్రిస్టోఫర్ నోలన్
ఉత్తమ ఒరిజినల్ సాంగ్ – ‘నేను దేని కోసం తయారు చేసాను?’ సినిమా బార్బీ
లుడ్విగ్ గోరాన్సన్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్ – ‘ఓపెన్‌హైమర్’
ఉత్తమ సౌండ్ -‘ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్’
Congratulations to Robert Downey Jr. on winning Best Supporting Actor for ‘Oppenheimer’! #Oscars pic.twitter.com/fFrgo9SiEn
— The Academy (@TheAcademy) March 11, 2024
ఉత్తమ సహాయ నటి: డెవిన్ జాయ్ రాండోల్ఫ్, ‘ది హోల్డోవర్స్’
ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్: ‘వార్ ఈజ్ ఓవర్ నౌ’
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్: ‘ది బాయ్ అండ్ ది హెరాన్’
ఉత్తమ ఒరిజినల్ స్క్రిప్ట్: ‘అనాటమీ ఆఫ్ ఎ ఫాల్’
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: ‘అమెరికన్ ఫిక్షన్’
ఉత్తమ మేకప్, కేశాలంకరణ: ‘పూర్ థింగ్స్’
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: ‘పూర్ థింగ్స్’
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: ‘పూర్ థింగ్స్’
ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్: ‘ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్’
ఉత్తమ సహాయ నటుడు: రాబర్ట్ డౌనీ జూనియర్, ‘ఓపెన్‌హైమర్’
Congratulations to the talented production design team behind ‘Poor Things’! #Oscars pic.twitter.com/3cGz0bm6zi
— The Academy (@TheAcademy) March 11, 2024
ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్: ‘ఓపెన్‌హైమర్’
ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ – ‘ది వండర్ ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్’
ఉత్తమ సినిమాటోగ్రఫీ – ‘ఓపెన్‌హైమర్’
Music to our ears! Ludwig Göransson is the winner of this year’s Best Original Score Oscar for ‘Oppenheimer’. #Oscars pic.twitter.com/jfi0wswmWM
— The Academy (@TheAcademy) March 11, 2024
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ – ’20 డేస్ ఇన్ మారిపోల్’
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ – ‘ది లాస్ట్ రిపేర్ షాప్’
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ – ‘గాడ్జిల్లా మైనస్ వన్’
