యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామి సాక్షిగా రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందన్నారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇలాంటి అవమానాలు లేని భారతం కోసమే బీఎస్పీ పోరాటం చేస్తోందంటూ ప్రవీణ్ కుమార్ తన ఎక్స్ లో ట్వీట్ చేశారు.
ఇది కూడా చదవండి:అసెంబ్లీలో చేసిన కులగణన తీర్మానం తూతూ మంత్రంగా చేశారు
యాదాద్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇవాళ( సోమవారం) ఉదయం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ యాదాద్రి పర్యటనకు వెళ్లారు. యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాల సందర్భంగా తొలిపూజలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీసమేతంగా పాల్గొన్నారు. సీఎంతోపాటు భట్టివిక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, కొండా సురేఖ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి దంపతులు, మంత్రులకు ఆలయ పండితులు ఆశీర్వనం అందించారు. ఆ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వరుసగా అక్కడున్న పీటలపై ఆసీనులయ్యారు. ఇక భట్టి విక్రమార్క, కొండా సురేఖకు పీటలు లేకపోవడంతో నేలపైనే కూర్చున్నారు.
దేవుడి సాక్షిగా ఉప ముఖ్యమంత్రికి అవమానం….!
ఈ అవమానాలు లేని భారతం కోసమే బీయస్పీ పోరాటం.@Bhatti_Mallu pic.twitter.com/zpSZZuBmEE
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) March 11, 2024
The post అవమానాలు లేని భారతం కోసమే బీఎస్పీ పోరాటం appeared first on tnewstelugu.com.
