డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు జరిగిన అవమానంపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై తక్షణం చర్యలు తీసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. యాదాద్రి దేవాలయంలో పూజల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులతో పాటు సహచర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లను గౌరవంగా ఎత్తయిన కుర్చీలపై కూర్చోబెట్టి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను నేలపై కూర్చోబెట్టడం వివక్షకు నిదర్శనమన్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను దేవుడి సాక్షిగా, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఘోరంగా అవమానించడం బాధాకరం. ఇది యావత్ దళిత జాతికి జరిగిన అవమానం. అణగారిన వర్గాలపై కాంగ్రెస్ ది కపట ప్రేమ అని, కాంగ్రెస్ కు దళితులపై ఎలాంటి ప్రేమలేదని తేటతెల్లమైందన్నారు ఎర్రోళ్ల శ్రీనివాస్.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణం దళిత జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రికి జరిగిన ఈ ఘోర అవమానానికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ వెంటనే స్పందించాలని… అట్రాసిటీ కేసు నమోదు చేయడంతో పాటు.. బాధ్యులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఎర్రోళ్ల శ్రీనివాస్.
ఇది కూడా చదవండి: రాజకీయాల్లోకి దందా కోసం రాలేదు.. ప్రజా సేవకోసం వచ్చాం
