యంగ్ హీరో కిరణ్ అబ్బవరం త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆయన తన ప్రియురాలిని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారు.తన తొలి సినిమా హీరోయిన్ రహస్య గోరక్ను ఆయన పెళ్లి చేసుకోనున్నారు. దాదాపు ఐదేళ్ల నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. రెండు కుటుంబాల పెద్దల అంగీకారంతో మార్చి 13న నిశ్చితార్థం జరగనుంది. హైదరాబాద్లోని ప్రైవేట్ రిసార్ట్స్ లో అతి తక్కువమంది బంధువులు, స్నేహితుల సమక్షంలో ఈ వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టులో పెళ్లి జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
‘రాజావారు రాణిగారు’తో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు కిరణ్ అబ్బవరం. ఇందులో రహస్య హీరోయిన్ గా నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య స్నేహం కుదిరింది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ గతంలో జోరుగా ప్రచారం సాగింది. అయితే, అలాంటిది ఏమీ లేదని.. రహస్య తనకు మంచి స్నేహితురాలు మాత్రమేనని కిరణ్ ఓ సందర్భంలో చెప్పారు.
ఇది కూడా చదవండి: రాజకీయాల్లోకి దందా కోసం రాలేదు.. ప్రజా సేవకోసం వచ్చాం
The post సినీ నటిని పెళ్లాడనున్న నటుడు కిరణ్ అబ్బవరం appeared first on tnewstelugu.com.
