రాజకీయాల్లోకి దందా కోసం రాలేదు.. ప్రజా సేవకోసం వచ్చామని తెలిపారు బీఆర్ఎస్ హైదరాబాద్ ఇంచార్జ్ దాసోజు శ్రవణ్ కుమార్. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా 31 జులై 2023 నెలలో అప్పటి క్యాబిట్ లో నన్ను కుర్ర సత్యనారాయణ ను గవర్నర్ కోటలో ఎమ్మెల్సీగా తీర్మానం చేశారని తెలిపారు. 55 రోజుల తర్వాత 25 సెప్టెంబర్ నెలలో గవర్నర్ తమ అభ్యర్థనను తిరస్కరించిననట్లు తెలిసింది. ఆ సమయంలోనే తాను గవర్నర్ కోటలో ఎమ్మెల్సీగా ఎన్నికైనందుకు శ్రీశైలం వెళ్ళాను. మొక్కు తీర్చుకుని బయటికి వచ్చే లోపు తమ గవర్నర్ కోట ఎమ్మెల్సీ రద్దు అయినట్టు వార్తలు వచ్చాయని..దీంతో తాను షాక్ అయ్యానన్నారు.
ఆ తర్వాత రాజ్యాంగ ఉల్లాఘన జరిగిందని కోర్టును ఆశ్రయించామని తెలిపారు దాసోజు శ్రవణ్. ఇప్పటి ప్రభుత్వం గవర్నర్ కోటలో 27న అమీర్ అలీ ఖాన్, కోదండరామ్ ల పేర్ల తో గజిట్ బయటి వచింది..రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని కోర్ట్ అభిప్రాయం వ్యక్తం చేసింది. కొందండరామ్, అమీర్ అలీ ఖాన్ ల నియామకం ఇల్లిగల్ అని రద్దు చేసింది కోర్టు.పేద కులంకు చెందిన వాళ్ళం మాకు న్యాయం చేయండి అని గవర్నర్ ను కోరుతున్నాం. రాజ్యాంగ బద్దం ప్రకారం గవర్నర్ కోట ఎమ్మెల్సీ తీర్మానం జరిగిందన్నారు. ఒకరు ఎరుకాల, మరొకరు విశ్వబ్రాహ్మణులం తమ వర్గం వారు మండలి లో కూర్చునే అర్హత లేదా? ప్రత్యేక్ష ఎన్నికల్లో పోటీ చేయాలి అంటే కోట్లు కర్చుపెట్టాల్సిన పరిస్థితి ఉంది. మా మీద నమ్మకం తో మావర్గాలకు చేయుతనిచ్చేందుకో గవర్నర్ కోటలో కేసీఆర్ మాకు అవకాశం కలిపిచారు. ప్రజలకు అండగా ఉంటాం అని రాజకీయాలలోకి వచ్చాము.. దందా కోసం రాలేదన్నారు దాసోజు శ్రవణ్.
దాసోజి ఫౌండేషన్ పేరుతో కోవిడ్ సమయంలో ఎన్నో సేవ కార్యక్రమాలు చేశామన్నారు. ఇప్పుడు ప్రభుత్వం మా ఫౌండేషన్ ను నడవకుండా చేయాలని చూస్తోందన్నారు. 2004 లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మా సినిమా పాట పల్లెకన్నీరు పెడుతోందో అనే పాట ప్రచారంతోనేనని చెప్పారు. మేము ముందు వరుసలో ఉన్నాం మాకు ఇచ్చాకే కోదండరాం, అమీర్ అలీ ఖాన్ లకు ఇవ్వండి. కోదండరామ్ ,అమీర్ అలీ ఖాన్ లకు మేము వ్యతిరేకం కాదన్నారు. మా హై కోర్టు తీర్పు కాపీ గవర్నర్ టేబుల్ పై ఉంది. గవర్నర్ మాకు న్యాయం చేస్తారని చేతులెత్తి మొక్కుతున్నామని అన్నారు దాసోజు శ్రవణ్ కుమార్.
ఇది కూడా చదవండి: అసెంబ్లీలో చేసిన కులగణన తీర్మానం తూతూ మంత్రంగా చేశారు
The post రాజకీయాల్లోకి దందా కోసం రాలేదు.. ప్రజా సేవకోసం వచ్చాం appeared first on tnewstelugu.com.
