కేసీఆర్ … చత్రపతి శివాజీ మహారాజ్ బాటలో 10 ఏండ్లు అద్భుతంగా పరిపాలించారన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిందేమో కొండంత చేస్తుందేమో గోరంత, మాటలు ఎక్కువ చేతలు తక్కువన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం వెంకటాయ పల్లిలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన హరీశ్ రావు ఆ తర్వాత మాట్లాడారు. రేవంత్ రెడ్డి మాట్లాడే అబద్ధాలు ఆకాశాన్ని అంటుతున్నాయి, చేసింది మాత్రం ఏదీ లేదు. రేవంత్ రెడ్డి మాట్లాడే బజారు భాష కంటే హీనంగా ఉంది. ఒక ముఖ్యమంత్రి లాగా మాట్లాడడం లేదు.. బజారు మనుషులు కూడా ఆ రకంగా మాట్లాడుకోరు.సీఎం పదవిని దిగజారే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. చీము నెత్తురు ఉంటే డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ చేస్తానన్న హామీ ఏమైంది.. ఎందుకు చేయాలేదు అని అడుగుతున్న అని అన్నారు.
వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు 13 హామీలు ఎక్కడ పోయాయి హామీలు ఏం మాట్లాడుతున్నావ్ బజార్ భాష అని అన్నారు హరీశ్ రావు. మా అక్కచెల్లెళ్లకు ఇస్తానన్న 2500 ఎక్కడపోయాయి రేవంత్ రెడ్డి అని అడుగుతున్న..మా అవ్వ తాతలకు ఇచ్చే 4 వేల పెన్షన్ ఎక్కడ అని అడుగుతున్న రేవంత్ రెడ్డి.నువ్వు బోనస్ ఎగ పెట్టినవ్, రైతు రుణమాఫీ ఎగ పెట్టినవ్,15 వేల రైతు బంధు ఎగ పెట్టినవ్, తులం బంగారం ఎగ పెట్టినవ్, ఇంకా సిగ్గు లేకుండా ఏ మొఖం పెట్టుకొని మాట్లాడుతున్నావ్, నోరు పెంచుకోవడం కాదు విజ్ఞతతో పాలన చేయు రేవంత్ రెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు హరీశ్ రావు.
నిన్ను ఎవడో దించుతాడు.. దించుతాడు అని మాట్లాడుతున్నావ్.. నిన్ను ఎవరు దించారు. నువ్వు ఇచ్చిన హామీలు నేర వేర్చక పోతే 5 ఏళ్ల తర్వాత జనమే తిరగపడతారు, తెలంగాణ ప్రజలే నిన్ను దించుతారు జాగ్రత్త అని హెచ్చరించారు హరీశ్ రావు.
ఇది కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డి దళిత జాతికి క్షమాపణ చెప్పాలి
