ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు ఈనెల 14తో ముగియనుంది. దీంతో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ ఉచిత అప్‌డేట్‌కు మరో మూడు నెలలు గడువు పొడిగిస్తున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించి ఉడాయ్ ఎక్స్ లో పోస్ట్ చేసింది. దీంతో జూన్ 14 వరకు ఉచితంగా ఆధార్‌లో మార్పులు చేసుకోవచ్చు.
మొదట 2023 మార్చి15 వరకు ఉన్న గడువును డిసెంబరు 14 వరకు పొడిగించింది. తర్వాత 2024 మార్చి 14 వరకు అప్‌డేట్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. తాజాగా మరోసారి గడువు తేదీని పొడిగించింది. ఆధార్ అప్‌డేట్ కోసం ప్రజల నుంచి విశేష స్పందన వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉడాయ్ ప్రకటించింది.
ఇది కూడా చదవండి: జర్నలిస్ట్ వెంకటేశ్‌పై చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ అనుచరుల దాడి
