MLA Mahipal Reddy | ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని పటాన్చెరు(Patancheru) ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి(MLA Mahipal Reddy) అన్నారు.
సంగారెడ్డి : ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని పటాన్చెరు(Patancheru) ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి(MLA Mahipal Reddy) అన్నారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. మంగళవారం జిన్నారం మండలంలోని అండూరులో కల్వర్టు, జంగంపేట-వావిలాల గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల మధ్య మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు అవసరమైన బ్రిడ్జిలు, కల్వర్టుల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. ఇవి పూర్తయితే ప్రజలకు దూరభారం తగ్గుతుందన్నారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల ప్రజల అవసరమైన సదుపాయాలు కల్పించడంతో పాటు, సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత పది సంవత్సరాల్లో గత పది సంవత్సరాలలో కేసీఆర్ నాయకత్వంలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామం అభివృద్ధికి ప్రతీకలుగా నిలిచాయన్నారు. ప్రస్తుత ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పూర్తి సహకారం అందించి నిధులు కేటాయించాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన పనులను వెంటనే ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.
