చేతికందొచ్చిన కొడుకుని డెంగీ జ్వరం రూపంలో మృత్యువు కబళించింది. కన్న కొడుకు కానరాని లోకాలకు వెళ్లిన పుట్టెడు దుఃఖంలోనూ ఆ తల్లిదండ్రులు ఔదార్యం చూపారు. తమ కొడుకు అవయవాలు దానం చేసి మరో ముగ్గురికి ప్రాణదానం చేశారు.
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నంకు చెందిన గాజుల శ్రీనివాస్-రమాదేవి దంపతుల చిన్న కొడుకు నందన్ (24)కు ఇటీవల డెంగీ జ్వరం రావడంతో తల్లిదండ్రులు సికింద్రాబాద్ యశోద దవాఖానలో చేర్పించారు. 19 రోజులపాటు క్రిటికల్ కేర్ యూనిట్‌లో ఉంచి మెరుగైన వైద్యం అందించినా ఫలితం దక్కకపోవడంతో బ్రెయిన్ డెడ్ అయినట్టు డాక్టర్లు తెలిపారు. ఇదే సమయంలో జీవన్‌దాన్ సంస్థ ఆ తల్లిదండ్రులకు అవయవ దానం పై అవగాహన కల్పించడంతో తమ కొడుకు అవయవదానానికి ముందుకు వచ్చారు. దీంతో డాక్టర్లు వైద్యులు కాలేయం, గుండె, ఊపిరితిత్తులను సేకరించారు. ఆ తర్వాత ఆసుపత్రి డాక్టర్లు, నర్సులతోపాటు సెక్యూరిటీ సిబ్బంది మృతదేహం దగ్గర గౌరవ వందనం సమర్పించారు.
ఇది కూడా చదవండి: బెంగళూరు నీటి కష్టాలు.. నెలకు ఐదుసార్లే స్నానం
