దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు సజీవదహనమయ్యారు. ఈ ఘటనలో మరికొంతమంది గాయపడ్డారు. నివాసభవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఈ ఘటన జరిగింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
STORY | 2 kids among 4 killed in fire in Delhi’s Shastri Nagar: Officials
READ: https://t.co/HdylCs5gCm pic.twitter.com/WDi95B04i7
— Press Trust of India (@PTI_News) March 14, 2024
శాస్త్రినగర్‌లోని వీధి నంబర్-13లోని 65వ నెంబరు ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఇది నాలుగు అంతస్తులతో కూడిన నివాస భవనం. దీనితో పాటు గ్రౌండ్ ఫ్లోర్, పార్కింగ్ కూడా ఉంది. పార్కింగ్ స్థలం నుంచి మంటలు చెలరేగి భవనమంతా వ్యాపించడంతో భవనం అంతా పొగతో నిండిపోయింది. వీధి చాలా ఇరుకుగా ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ, “గీతా కాలనీ సమీపంలోని శాస్త్రి నగర్లో ఉదయం 5.20 గంటలకు భారీ అగ్నిప్రమాదం గురించి మాకు సమాచారం అందింది. వెంటనే ఢిల్లీ ఫైర్ సర్వీస్‌కు సమాచారం అందించాం. ఘటనా స్థలానికి ఒక పోలీసు బృందం, నాలుగు ఫైర్ టెండర్లు, అంబులెన్స్, పిసిఆర్ వ్యాన్‌ను పంపారు. అగ్నిప్రమాదం జరిగిన భవనంలో నాలుగు అంతస్తులు ఉన్నాయని, గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ ఉందని పోలీసులు తెలిపారు. పార్కింగ్ స్థలం నుంచి మంటలు చెలరేగాయని, పొగలు భవనం అంతటా వ్యాపించాయని చెప్పారు.
ఇరుకైన వీధిలో భవనం ఉండటంతో అగ్నిమాపక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకోవడానికి చాలా ఇబ్బందిపడాల్సి వచ్చిందని అధికారి తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన ముగ్గురు పురుషులు, నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులను హెడ్గేవార్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.మృతుల్లో 30 ఏళ్ల మనోజ్, 28 ఏళ్ల మహిళ సుమన్, 3 ఏళ్ల బాలిక, 6 నెలల పాప ఉన్నారు.
ఇది కూడా చదవండి : అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్..!
The post ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం..ఇద్దరు బాలికలు సహా నలుగురు సజీవదహనం.! appeared first on tnewstelugu.com.
