మాజీ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ తీవ్ర అస్వస్థతలో ఆసుపత్రిలో చేరారు. పుణెలోని భారతీ హాస్పిటల్లో బుధవారం రాత్రి నుంచి చికిత్స పొందుతున్నట్లు ఆసుపత్రి సీనియర్ అధికారి వెల్లడించారు. జ్వరం, ఛాతీలో ఇన్ఫెక్షన్ తో ప్రతిభాపాటిల్ బాధపడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పరిస్ధితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ప్రతిభా పాటిల్ భారతదేశానికి మొదటి మహిళా రాష్ట్రపతిగా చరిత్ర క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె 2007 నుండి 2012 వరకు అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్నారు.
STORY | Ex-President Pratibha Patil hospitalised, condition stable
READ: https://t.co/MoTdrldISt pic.twitter.com/qlYhU1zvEr
— Press Trust of India (@PTI_News) March 14, 2024
ఇది కూడా చదవండి:చేతకాక చేత్తులెత్తేసిన కాంగ్రెస్..పంటలకు దేవుడే దిక్కంటోన్న మంత్రి.!
