కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ పాలన, మార్పు ఉంటుందని గొప్పలు చెప్పారని, మార్పు అంటే పంటలు ఎండటమేనా? అని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ ప్రశ్నించారు. ఇవాళ(గురువారం) మంథని మండలం మైదుపల్లి, కాకర్లపల్లి శివారులో ఎండిపోయిన పంట పొలాలను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన… పదేళ్ల తర్వాత రైతులను నీళ్ల కోసం రోడ్డెక్కించిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. నీళ్లు, కరెంటు ఇచ్చి రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఈనాడు ఆ దిశగా అడుగులు వేయడం లేదన్నారు.
స్వయానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరుపై ప్రజలు విస్మయానికి గురవుతున్నారని, నెత్తిమీద కాలుపెట్టి తొక్కుతా, పేగులు మెడలో వేసుకుంటా, మానవబాంబులమైతమని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు పుట్ట మధుకర్.
ఇది కూడా చదవండి: పోస్టాఫీసు పథకంతో నెలకు రూ.9 వేలు ఆదాయం
