మైనర్ బాలికను లైంగికంగా వేధించాడంటూ బాధితురాలి తల్లి చేసిన ఫిర్యాదుపై మాజీ సీఎం యడ్యూరప్పపై పోక్సో కేసు నమోదైంది. ఓ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు యడ్యూరప్పపై అభియోగాలు నమోదు అయ్యాయి. 17ఏండ్ల బాలిక తల్లి ఫిర్యాదుతో బెంగుళూరులోని సదాశివనగర్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఫోక్సో చట్టంలోని సెక్షన్ 8, ఐపీసీ సెక్షన్ 354(ఎ) కింద కేసు నమోదు చేశారు.
ఫిర్యాదులో ఏముంది?
బాధిత బాలిక తల్లి గురువారం రాత్రి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి బీఎస్‌వైపై ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలంటూ ఫిబ్రవరి 2న డాలర్స్ కాలనీలోని బీఎస్‌వై నివాసానికి వెళ్లిన తన మైనర్ కుమార్తెను వేధించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.అయితే ఈ విషయంపై కర్నాటక మాజీ సీఎం ఇప్పటివరకు స్పందించలేదు.
లోకసభ ఎన్నికలకు ముందు యడ్యూరప్పపై ఈ ఆరోపణలు రావడం సర్వాత్ర చర్చనీయాంశంగా మారింది. 2008-11 మధ్య కర్నాటక సీఎంగా యడ్యూరప్ప పనిచేశారు. 2018లో కొద్ది రోజులపాటు ఆ తర్వాత జులై 2019-2021 మధ్య మరోసారి సీఎంగా పనిచేశారు. 2021లో జులైలో బీజేపీ హైకమాండ్ యడ్యూరప్పను సీఎం నుంచి తొలగించింది. ప్రస్తుతం ఆయన కుమారుడు విజయేంద్ర యడియూరప్ప రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
ఇది కూడా చదవండి: రామమందిరాన్ని లీజుకు తీసుకున్నట్లుగా బీజేపీ వ్యవహరిస్తోంది.!
