Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Underwater Metro | ప్రజలకు అందుబాటులోకి వచ్చిన నదీగర్భ మెట్రో.. క్యూ కట్టిన ప్రయాణికులు-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 15, 2024No Comments

Underwater Metro | దేశంలోనే మొట్టమొదటి నదీ గర్భ మెట్రో (Indias First Underwater Metro Service) ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.

March 15, 2024 / 03:54 PM IST
Underwater Metro | ప్రజలకు అందుబాటులోకి వచ్చిన నదీగర్భ మెట్రో.. క్యూ కట్టిన ప్రయాణికులు

Underwater Metro | దేశంలోనే మొట్టమొదటి నదీ గర్భ మెట్రో (Indias First Underwater Metro Service) ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో నిర్మించిన ఈ నదీగర్భ మెట్రోను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఇటీవలే ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మెట్రో కార్యకలాపాలు పబ్లిక్‌కు అందుబాటులోకి వచ్చాయి.

శుక్రవారం ఉదయం నుంచి మెట్రో రైడ్‌కు ప్రయాణికులను అనుమతిస్తున్నారు. దీంతో దేశంలోనే మొట్టమొదటి నదీగర్భ మెట్రోలో ప్రయాణించేందుకు స్థానికులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ మేరకు మెట్రో స్టేషన్‌కు పోటెత్తారు. పెద్దసంఖ్యలో ప్రయాణికులు హౌరా మైదాన్‌ (Howrah Maidan) స్టేషన్‌కు చేరుకున్నారు. దీంతో అక్కడ రద్దీ నెలకొంది. టికెట్స్‌ కౌంటర్‌ వద్ద భారీ క్యూలైన్లు దర్శనమిచ్చాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కోల్‌కతా మెట్రో రైలు అధికారులు సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.

First commercial #Metro service entering newly inaugurated #Majerhat station of #PurpleLine this morning… pic.twitter.com/84GO8IxacV

— Metro Railway Kolkata (@metrorailwaykol) March 15, 2024

మరోవైపు ప్రయాణికులు ఈ అండర్‌ వాటర్‌ మెట్రోలో ప్రయాణించి థ్రిల్‌ను ఫీల్‌ అవుతున్నారు. అంతేకాకుండా సెల్ఫీలు, ఫొటోలతో సందడి చేస్తున్నారు. ‘వందే భారత్‌..’, ‘భారత్‌ మాతా కీ జై’ నినాదాలు చేస్తూ రైలు ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ మేరకు దేశంలోనే మొదటి నదీగర్భ మెట్రోలో తమ ప్రయాణ అనుభవాలను పంచుకుంటున్నారు. ఈ మెట్రోను అందుబాటులోకి తెచ్చినందుకు ముందుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ రైల్లో ప్రయాణించేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నామని, అయితే టికెట్లు పొందడానికే కాస్త సమయం పడుతోందంటూ ప్రయాణికులు చెబుతున్నారు.

#Metro passengers queuing up at #Esplanade Metro station this morning to be a part of the history….. pic.twitter.com/smVgUQX9uJ

— Metro Railway Kolkata (@metrorailwaykol) March 15, 2024

ఈ మెట్రో మార్గాన్ని (Indias first underwater metro train) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 6వ తేదీన ప్రారంభించిన విషయం తెలిసిందే. కోల్‌కతా (Kolkata ) ఈస్ట్‌-వెస్ట్‌ మెట్రో కారిడార్‌ (East-West metro corridor) లో భాగంగా 4.8 కిలోమీటర్ల ఎస్‌ప్లనడే-హౌరా మైదాన్‌ సెక్షన్‌ను నిర్మించారు. ఇందులో భాగమైన 520 మీటర్ల అండర్‌ వాటర్‌ మైట్రో లైన్‌ హుగ్లీ నది కింద నుంచి వెళ్తుంది. ఈ మార్గం కోల్‌కతాలోని రెండు జంట నగరాలైన హౌరా, సాల్ట్‌ లేక్‌లను కలుపుతుంది. ఈ మార్గంలో మొత్తం మూడు స్టేషన్లు ఉండగా అందులో మూడు భూగర్భం (జలాంతర్గ)లో ఉన్నాయి.

అండర్‌ వాటర్‌ మెట్రో విశేషాలు

  • హౌరా మైదాన్‌-ఎస్‌ప్లనడే సెక్షన్‌ దేశంలోనే నది కింద నిర్మితమైన తొలి టన్నెల్‌.
  • నీటి ఉపరితలానికి 16 మీటర్ల దిగువన మెట్రో సర్వీసులు నడుస్తాయి.
  • హౌరా మెట్రో స్టేషన్‌ దేశంలోనే అత్యంత లోతైన మెట్రో స్టేషన్‌. ఇది భూ ఉపరితలానికి 32 మీటర్ల లోతులో ఉంటుంది.
  • కోల్‌కతా ఈస్ట్‌-వెస్ట్‌ మెట్రో కారిడార్‌ మార్గం పొడవు 16.6 కిలోమీటర్లు కాగా.. 10.8 కిలోమీటర్లు భూగర్భంలో ఉంటుంది.
  • ఇందులో 4.8 కిలోమీటర్లు ఉండే ఎస్‌ప్లనడే – హౌరా మైదాన్‌ సెక్షన్‌ను రూ.4,960 కోట్లతో నిర్మించారు.
  • ఈ లైన్‌లో భాగంగా 520 మీటర్ల పొడవైన హుగ్లీ నది దిగువ మార్గాన్ని 45 సెకన్లలో దాటడం ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది.
  • లండన్‌-ప్యారిస్‌ కారిడార్‌లోని యూరోస్టార్‌ సర్వీస్‌ మాదిరిగా ఈ మెట్రో టన్నెల్‌ నిర్మించారు.
  • దేశంలోనే తొలిసారిగా 1984లో మెట్రో రైల్‌ సేవలు ప్రారంభమైన కోల్‌కతాలోనే మొదటి అండర్‌ వాటర్‌ మెట్రో సేవలు ప్రారంభం కావడం విశేషం.

The first #HowrahMaidan-bound #Metro from #Esplande is about to start. History is about to be made….. pic.twitter.com/ZttkKkcfEj

— Metro Railway Kolkata (@metrorailwaykol) March 15, 2024

Commuters assembled at #HowrahMaidan #Metro station this morning to catch the first Metro. pic.twitter.com/JA81troMLj

— Metro Railway Kolkata (@metrorailwaykol) March 15, 2024

Also Read..

Russian oil tycoon | రష్యన్‌ ఆయిల్‌ టైకూన్‌ అనుమానాస్పద మృతి.. ఉక్రెయిన్‌తో యుద్ధం తర్వాత నాలుగో ఘటన

Palestine | యుద్ధం వేళ పాలస్తీనాకు కొత్త ప్రధాని.. సలహాదారుడినే పీఎంగా నియమించిన అధ్యక్షుడు

Gaza | ఆహారం కోసం వేచిచూస్తున్న వారిపై కాల్పులు.. 29 మంది మృతి



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.