లోకసభ ఎన్నికల ముందు తెలంగాణలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఆపార్టీకి చెందిన మాజీ ఎంపీ కాంగ్రెస్ లో చేరారు. బీజేపీ సీనియర్ నేత, మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి శుక్రవారం రాత్రి కాంగ్రెస్ లో చేరారు. పార్టీ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ..కాంగ్రెస్ కండువా కప్పి జితేందర్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సీఎం, డిప్యూటీ సీఎం, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరలు పాల్గొన్నారు.
మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ఆశించిన జితేందర్ రెడ్డికి బీజేపీ అవకాశం కల్పించలేదు. దీంతో ఆయన తీవ్ర అసంత్రుప్తితో ఉన్నారు. ఈక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గురువారం జితేందర్ రెడ్డి నివాసానికి వెళ్లి కలిసారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో చేరిన వెంటనే ఆయనను పదవి వరించింది. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇది కూడా చదవండి: ఆర్బీఐకి ప్రపంచంలోనే అత్యుత్తమ సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డు.!
