టీఎస్ ఆర్టీసీ ప్రయాణీకులను ఆకర్షించేందుకు కొత్త కొత్త ప్లాన్లను తీసుకువస్తుంది. ఆర్టీసీ బస్సుల గురించి ప్రయాణీకులను పూర్తి సమాచారం తెలిసేలా కొత్త టెక్నాలజీని కూడా వినియోగించుకుంటోంది. దీంతో ప్రయాణికులకు మరింత దగ్గరయ్యేలా ప్లాన్ చేస్తోంది. అయితే బస్సు జాడ తెలిపే గమ్యం యాప్ ను గతేడాది టీఎస్ ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువచ్చింది.ఈయాప్ ద్వారా ప్రయాణీకులు తమ బస్సు ఎక్కడుందో ఈజీగా తెలుసుకోవచ్చు. అయితే విమానశ్రయానికి వెళ్లే ఎలక్ట్రిక్ బస్సులకు మినహా మిగతా వాటిలో ఈ యాప్ లేదు. కొత్త బస్సులు సమకూరితే వాటిలో వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ ను అమర్చాలని ఆర్టీసీ నిర్ణయించింది. మంగళవారం ప్రారంభించిన 22 బస్సుల్లో గమ్యం యాప్ ను అందుబాటులోకి తీసుకవస్తున్నారు.
ముందుగా దూరప్రాంతాల ఎక్స్ ప్రెస్ సూపర్ లగ్జరీ, ఏపీ బస్సులను యాప్ కు అనుసంధానం చేశారు. తర్వాత నగరంలో తిరిగే అన్ని బస్సులకు అమర్చాలని ప్రయత్నాలు చేశారు. మొత్తం 500 ఎలక్ట్రిక్ బస్సులు ఆగస్టు నాటికి రానున్నాయి. ఇవన్నీ నాన్ ఏసీ బస్సులే. పాత మెట్రో ఎక్స్ ప్రెస్ ల స్థానంలో వస్తున్న బస్సులని అధికారులు చెబుతున్నారు. ఓ వైపు అద్దెకు ఎలక్ట్రిక్ బస్సులు తీసుకుంటుండగానే టీఎస్ ఆర్టీసీ సొంతంగా 565 డీజిల్ బస్సులను సమకూర్చుకుంటోంది. ఈ ఏడాది మొత్తం 1100 బస్సులు కొత్తవి రానున్న నేపథ్యంలో అన్నిటినీ గమ్యం యాప్ కు అనుసంధానం చేసి ప్రయాణికులకు బస్సుల సమాచారం తెలిసేలా చర్యలు తీసుకుంటామని అధికారులు వివరించారు.
ఇది కూడా చదవండి: కొత్త కోడ్ తో ఆర్టీఏ కాసుల వర్షం.!
The post టీఎస్ ఆర్టీసీ సరికొత్త యాప్..బస్సు ఎక్కడుందో చెబుతుందట.! appeared first on tnewstelugu.com.
