ఢిల్లీ మద్యం కుంభకోణంకేసు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఊరట లభించింది. కేజ్రీవాల్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు బెయిల్ బాండ్‌ను అంగీకరించి కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసిందని ఆయన తరపు న్యాయవాది రమేష్ గుప్తా వెల్లడించారు. 15,000 వ్యక్తిగత పూచీకత్తుపై అరవింద్ కేజ్రీవాల్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇంతకు ముందు, ఈడీ అరవింద్ కేజ్రీవాల్‌ను 8 సార్లు సమన్లు చేసిందని, కానీ ఇప్పటివరకు అరవింద్ కేజ్రీవాల్ ఒక్కసారి కూడా ED కార్యాలయానికి విచారణకు వెళ్లలేదు. తాజాగా ఈడీ సమన్లను వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు ఈ కేసులో కేజ్రీవాల్‌కి రూస్ అవెన్యూ కోర్టు నుంచి పెద్ద దెబ్బ తగిలింది. కేజ్రీవాల్‌కు హాజరుకావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు, కేజ్రీవాల్ తన వ్యక్తిగత హాజరు నుండి తప్పించుకోవాలంటూ చేసిన అభ్యర్థనను తిరస్కరిస్తూ, ఈరోజు కోర్టుకు హాజరు కావాలని కోరింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోర్టుకు చేరుకోగానే అక్కడ భద్రతా ఏర్పాట్లను పెంచారు. ఈ సందర్భంగా ఈడీ తరపున ఏఎస్జీ ఎస్వీ రాజు రూస్ అవెన్యూ కోర్టుకు చేరుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్ తన లాయర్ రమేష్ గుప్తా, పీఏ విభవ్తో కలిసి కోర్టుకు చేరుకున్నారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ న్యాయస్ధానం బెయిల్ మంజూరు చేసింది. లక్ష పూచీకత్తుతో ఈ బెయిల్ ఇచ్చింది. అనంతరం జడ్జి అనుమతితో కోర్టు నుంచి కేజ్రీవాల్ వెళ్లిపోయారు.
ఇది కూడా చదవండి: అమెజాన్ సమ్మర్ కూల్ సేల్..ఫ్రిజ్-ఏసీలపై భారీ తగ్గింపు.!
