దేశంలో సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. లోకసభతోపాటు ఏపీ, ఒడిశా, అరుచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని ఈసీ తెలిపింది. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరగనుంది. ఏపీకి మే 13వ తేదీన ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి అన్ని ఫలితాలను వెల్లడించనున్నట్లు ఈసీ తెలిపింది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్:
-మార్చి 18న నోటిఫికేషన్
-ఏప్రిల్ 25 నామినేషన్లకు చివరి తేదీ
-ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన
-ఏప్రిల్ 29న ఉపసంహరణకు చివరి తేదీ.
– మే 13 పోలింగే తేదీ.
-జూన్ 4 ఓట్ల లెక్కింపు
మొదటి దశ- ఏప్రిల్ 19 (102 సీట్లు)రెండవ దశ- ఏప్రిల్ 26 (89 సీట్లు)మూడవ దశ- మే 7 (94 సీట్లు)నాల్గవ దశ- 13 మే (96 సీట్లు)ఐదవ దశ – మే 20 (49 సీట్లు)ఆరవ దశ – 25 మే (57 సీట్లు)ఏడవ దశ – జూన్ 1 (57 సీట్లు)
ఇది కూడా చదవండి: మోగిన సార్వత్రిక ఎన్నికల నగారా..ఎన్నికల షెడ్యూల్ ఇదే.!
